నాకిచ్చిన అవకాశాలను నేను సక్రమంగా వినియోగించకపోతే అవి వేరొకరికి తరలిపోక తప్పదు.
నా జ్ఞానమును ధుర్వినియోగ పరిస్తే, నా సౌందర్యమును ధుర్వినియోగ పరిస్తే, నా ధనమును ధుర్వినియోగ పరిస్తే, ఇక అవి నన్ను చేరుట ఆగిపోతుంది.
ఎవరూ చూడనప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజ స్వభావం. జాగ్రత్త ఆ స్వభావం నిన్ను నపుంసకునిగా చేయకుండా చూసుకో.
నీవు సర్వ శక్తివంతుడవు. అలాంటి నిన్ను విషయవాంఛలు ఆడించడం అవమానకరం.
సత్ప్రవర్తన నుండి మరలకు-అది జ్ఞానం కంటే విలువైనది.